కేంద్ర నిధులు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయో దృష్టి పెట్టండి : పవన్ కళ్యాణ్

కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

Update: 2020-03-28 18:16 GMT
Pawan Kalyan (File Photo)

కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఆందోళనలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని ఆ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులతో ఆయన శనివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రపంచమంత విలయ తాండవం చేస్తుందని అన్నారు. ఈ విపత్కర సమయంలో స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు. మన దగ్గర లాక్‌డౌన్‌ విధించిన క్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించలని పార్టీ శ్రేణులకు పిలపునిచ్చారు. రైతులు, కార్మికులు, పేదలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకో వాలన్నరు. ప్రజాసమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, స్థానికంగా ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం చేపడుతున్న పనులను పరిశీలించాలని పవన్కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు.

కేంద్ర ప్రభుత్వం నిధులు ఏ విధంగా వ్యయం అవుతున్నాయో దృష్టి పెట్టండి. మామిడి రైతుల సమస్య నా దృష్టికి వచ్చింది. మీ దృష్టికి వచ్చిన సమస్యలను కూడా పార్టీ కార్యాలయానికి నివేదిక ఇవ్వండి. కరోనా నేపథ్యంలో మీరు, మీ కుటుంబ సభ్యులు, జనసైనికులు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి''రైతుల్లో నెలకొన్న ఆందోళనపై రైతుల సమస్యలు సామాజిక మాధ్యమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాను పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనాపై పోరుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్‌ కల్యాణ్‌ రూ.2కోట్లు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఈ సందర్భంగా పలువురు నాయకులు పవన్ కళ్యాణ్ అభినందించారు


Tags:    

Similar News