Daggubati Purandeswari: టీడీపీ, బీజేపీ కలిస్తే బాగుంటుందని పవన్ అన్నారు

Daggubati Purandeswari: రాష్ట్రనేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ప్రకటన

Update: 2023-09-23 10:57 GMT

Daggubati Purandeswari: టీడీపీ, బీజేపీ కలిస్తే బాగుంటుందని పవన్ అన్నారు

Daggubati Purandeswari: టీడీపీ, బీజేపీ కలిస్తే బాగుంటుందన్న పవన్‌కల్యాణ్ అభిప్రాయంపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. తక్షణంగా నిర్ణయం ప్రకటించడానికి తమది ప్రాంతీయ పార్టీ కాదని, జాతీయ స్థాయిలో చర్చ తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేత నుంచే అరాచకం ప్రారంభమైందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని పురంధేశ్వరి ఆరోపించారు.

Tags:    

Similar News