జనసేన ఏకైక ఎమ్మెల్యే పార్టీని వీడతారా?

Update: 2019-12-04 00:26 GMT

జనసేన పార్టీ టికెట్‌పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. గతకొంతకాలంగా ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికి తోడు ఆయన అవసరం లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వైసీపీలో కీలకనేతలు, మంత్రులతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనను పట్టించుకోవడంలేదన్న ప్రచారం జనసేన సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ కారణాలతో ఎమ్మెల్యే రాపాక జనసేనను వీడి వైసీపీలో చేరవచ్చని అంటున్నారు విశ్లేషకులు. దీనిపై స్వయంగా ఎమ్మెల్యే రాపాక స్పందించారు. తాను జనసేనను వీడటం లేదని.. అభివృద్ధికోసమే వైసీపీ నేతలను కలుస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఇటీవల జనసేన నుంచి వైసీపీలో చేరిన అద్దేపల్లి శ్రీధర్ స్పందించారు. దీనిపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జనసేనకు సన్నిహితంగా ఉన్న ముగ్గురు నాయకులు వైసీపీలో చేరారని ఆయన అన్నారు. కాబట్టి, అతను కూడా వైసీపీలో చేరవచ్చు. అయితే, ఈ విషయంలో వరప్రసాద్ తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని అన్నారు.

Tags:    

Similar News