అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా : పవన్‌ కల్యాణ్

Update: 2019-12-03 11:24 GMT

వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. వైసీపీ నేతలకు ఆస్తులు, ప్రాణాలపై తీపి ఉందని తాను మాత్రం అన్నీంటికి తెగించి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనకు ఆస్తులు, ప్రాణాలపై మమకారం లేదన్నారు పవన్‌కల్యాణ్‌. జైల్లో ఉన్నవారే సీఎం అయ్యారన్నారు. భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వ్యక్తినని సమాజం పట్ల బలంగా ఉండేవారే రాజకీయాల్లోకి రావాలని సూచించారు.

నా మాతం మానవత్వం నా కులం మాటతప్పదన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలపై జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్ స్పందించారు. తన కులం మాట తప్పదన్న జగన్‌ మిగతా కులాలు మాట తప్పుతాయా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల భాష తీరు దారుణంగా ఉందన్నారు‌. ఏ అంశంపై మాట్లాడుతున్నారో అవగాహన ఉందా అని ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తులు ఇంత దిగజారి మాట్లాడటం సరికాదన్నారు.

సొంత మాతృభాషను చంపేసే పరిస్థితి తీసుకొచ్చారన్నారు పవన్‌కల్యాణ్‌. రాయలసీమలో కత్తులు కాదు చదువుల తల్లులు ఉంటారన్న పవన్‌, ఎవరి వల్ల ఈ ప్రాంతానికి చెడ్డపేరు వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

భవిష్యత్‌ తరాల గురించి ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. సమాజం పట్ల బలంగా ఉండే వారే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. రాజకీయాల్లోకి వస్తే త్రికరణశుద్ధిగా ఉండాలన్నారు పవన్‌ కల్యాణ్.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లాంటి వ్యక్తి ఈ దేశానికి చాలా అవసరమన్నారు పవన్‌కల్యాణ్‌. సున్నితంగా మాట్లాడితే వినే పరిస్థితుల్లో ఎవరూ లేరని కఠినంగా ఉండాలని సూచించారు. అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ సమాజంలో జరుగుతున్న చెడుపై పోరాటమే జనసేన లక్ష్యమన్నారు.

Tags:    

Similar News