ఇటీవల ఇసుక కొరత మీద విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేన చీఫ్, నటుడు పవన్ కళ్యాణ్ అధికార పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటుకే పరిమితం అయిన జనసేన.. ప్రభుత్వానికి దడ పుట్టిస్తోంది. ఇదిలావుండగా, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఐదుగురు జనసేన నేతలను ఎంపిక చేశారు. ఈ సందర్బంగా ఎంపిక చేసిన సభ్యులను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు.
పార్టీ సభ్యుల పీఏసి సభ్యులుగా జనసేన నాయకులు శ్రీ పాంథం నానాజీ, శ్రీ మధుసూధన్ రెడ్డి, శ్రీ బోనబొయినా శ్రీనివాస్ యాదవ్, శ్రీ పిథాని బాలకృష్ణ ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ వారిని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ, "నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాను పీఏసి యొక్క కొత్త సభ్యులు: శ్రీ పాంథం నానాజీ, శ్రీ మధుసూధన్ రెడ్డి, శ్రీ బోనబొయినా శ్రీనివాస్ యాదవ్, శ్రీ పిథాని బాలకృష్ణ" అని పేర్కొన్నారు. మరోవైపు, ఇసుక కొరత సమస్యపై పవన్ కళ్యాణ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.