Pawan Kalyan: నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి..
Pawan Kalyan: వైద్యరంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు.
Pawan Kalyan: నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి..
Pawan Kalyan: వైద్యరంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో...రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారన్నారు. నిస్వార్థంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యంతో పాటు సాంత్వన కలిగిస్తుందని తెలిపారు.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్ నర్సులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.