కర్నూలులో పవన్ కళ్యాణ్ సంచలన వ్యా‌ఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలపై అత్యాచారాలు జరుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు.

Update: 2020-02-12 13:08 GMT
Pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలపై అత్యాచారాలు జరుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ బరిరంగ సభలో మాట్లాడారు. విద్యా సంస్థల్లోనే అత్యాచార ఘటనలు జరిగితే పిల్లల్ని ఇంకెవరు రక్షిస్తారని నిలదీశారు. కర్నూలు జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం హత్య చేసి నిందితులు దర్జాగా తిరుగుతున్నారని, బాధితులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకపోతే.. ఇలాంటి అఘాయిత్యాలు రేపు మన ఇంట్లోకి చొరబడి చేస్తారన్నారు. బాదితురాలి కుంటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

సీఎం వైఎస్ జగన్‌ 'దిశ' సంఘటన గురించి మాట్లాడినప్పుడు.. కర్నూలు జిల్లా బాలిక హత్య ఉదంతం గురించి ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కర్నూలును జిల్లాను న్యాయరాజధానిగా ప్రకటించారని, ఇక్కడే న్యాయం చేయకపోతే న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు.

బాలిక కుటుంబానికి న్యాయం చేయలేకపోతే న్యాయ రాజధాని పెట్టినా.. ఏం ప్రయోజనమని అన్నారు. బాలికపై హత్యాచార కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని తెలిపారు. ఒక రోజు నిరాహార దీక్షకు సైతం దిగుతానని పవన్ ప్రకటించారు.

రాజమహేంద్రవరంలో 'దిశ' పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేశారని, 'దిశ' స్టేషన్లు కర్నూలులో కూడా ఏర్పాటు చేయాలన్నారు. బాధితురాలు గిరిజన బాలిక అని చూడకుడదని.. కులాలు, మతాలు ఏవైనా న్యాయం ఒక్కటే ఉండాలని సూచించారు. అగ్రవర్ణాలకు ఒక న్యాయం, గిరిజనులకు ఒక న్యాయం ఉండకూడదని పవన్ అన్నారు. న్యాయం చేయలేనప్పుడు సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని అందరూ ప్రశ్నిస్తున్నారని, కానీ రాజకీయ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

కర్నూలు జిల్లాల్లో 2017లో సృష్టించిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును సంచలనం సృష్టించింది. కర్నూలులోని లక్ష్మీగార్డెన్‌ ఉంటున్న రాజు నాయక్, పార్వతి దంపతుల కుమార్తె ప్రీతి. దిన్నెదేవరపాడు దగ్గరలోని రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిలో చదువుతోంది. ఈ రెసిడెన్షియల్ పాఠశాల ఓ పార్టీకి చెందిన వారిదేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే 2017లో ఆగస్టు 19న సుగాలి ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. ప్రీతి తల్లిదండ్రులు తమ కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు.



  

Tags:    

Similar News