ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా పవన్ కామెంట్స్

Pawan Kalyan: టీడీపీ పొత్తు ధర్మం తప్పిందంటూ మాట్లాడిన జనసేనాని

Update: 2024-01-27 06:21 GMT

ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా పవన్ కామెంట్స్

Pawan Kalyan: గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి. రాబోయే ఎన్నికల్లో కలిసే పోరాడి.. ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ, జనసేనలు స్పష్టం చేశాయి. అయితే సడెన్‌గా పొత్తు ధర్మాన్ని టీడీపీ ఉల్లంఘించిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. అసలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయా అన్న అనుమానాలకు దారి తీశాయి.

అటు జనసేనతో దోస్తీ కంటిన్యూ అవుతుందని బీజేపీ కూడా ప్రకటనలు చేస్తూ ఉంది. మరో వైపు ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్‌ను ప్రకటించేందుకు యోచిస్తోంది కమలం పార్టీ. మరి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీతో వెళ్తుందా. లేదా బీజేపీతో కలిసి పనిచేస్తుందా అదీ కాక మూడు పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతాయనా అనే విషయాలపై క్లారిటీ లేదు. అసలు పవన్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటని ఇరుపార్టీల్లో చర్చ స్టార్ట్ అయింది.

Tags:    

Similar News