బెదిరింపులు, దాడులతో భయపడేది లేదు : పవన్ కల్యాణ్

Update: 2020-03-12 12:47 GMT
Pawan Kalyan & BJP Press Meet

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ నేతలతో కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నామినేషన్లు వేయలేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. బెదిరింపులు, దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవం అనిపించొచ్చని భయపెట్టి గెలిచిన గెలుపు నిజమైన గెలుపు కాదన్నారు.

స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటుందని బీజేపీ రాష్ర్ట అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ఇబ్బందులు పడి నామినేషన్లు వేసిన తర్వాత, స్ర్కూటినీలో ఎన్నికల అధికారులు తీసేస్తున్నారని ఆరోపించారు. ఏకగ్రీవం కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తు్న్నారని ఆయన విమర్శించారు.


Full View


Tags:    

Similar News