Pawan kalyan: పోటీపై పవన్ మనసు మార్చుకున్నారా..?

Pawan Kalyan: పవన్ ప్రకటన వెనుక కొత్త వ్యూహం ఉందా..?

Update: 2024-03-20 15:44 GMT

Pawan kalyan: పోటీపై పవన్ మనసు మార్చుకున్నారా..?

Pawan Kalyan: రాబోయే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించినా.. ఇంకా ఆయోమయం కొనసాగుతూనే ఉంది. తాగాజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే.. జనసైనికులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తానని అంటూనే.. కాకినాడ ఎంపీ సీటు వైపు కూడా చూస్తుండటంతో..ఇంతకు పవన్ స్ట్రాటజీ ఎంటనే చర్చ జరుగుతోంది.

పవన్ కల్యాన్ పోటీపై మొదటి నుంచే కన్‌ప్యూజనే. తొలుత భీమవరం, గాజువాక, తిరుపతి అసెంబ్లీ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత అసెంబ్లీలో పోటీ చేయడం లేదని.. ఎంపీగా బరిలో నిల్చుంటారనే మరో ప్రచారం జరిగింది. కట్ చేస్తే అనూహ్యంగా పిఠాపురం స్థానాన్ని ఎంచుకున్నారు పవన్. సామాజిక ఓట్లు, గెలుపు అంచనాలను బేరిజు వేసుకుని.. అక్కడి నుంచి పోటీకి రెడీ అయ్యారు. ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువగా ఉండటంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు పవన్. ఐతే జనసేనానికి చెక్ పెట్టేందుకు.. వైసీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పవన్‌కు పోటీగా కాపు సామాజికవర్గానికే చెందిన వంగా గీతాను ప్రకటించింది. అంతటితోనే ఆగకుండా.. ఆపరేషన్ పిఠాపురం చేపట్టారు జగన్. కాపు ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు.. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత ముద్రగడను రంగంలోకి దింపుతోంది.

అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీగా చేరికలకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మిథన్‌రెడ్డిని ఆదేశించారు జగన్. మండలాలవారీగా నేతలకు వైసీపీ బాస్ బాధ్యతలు అప్పగించారు. గొల్లప్రోలు- కన్నబాబు, యూ.కొత్తపల్లి- దాడిషెట్టి రాజా, పిఠాపురం టౌన్- మిథున్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పారు. వంగా గీతను వైసీపీ అభ్యర్థిగా గెలిపించేందుకు అధికార పార్టీ అస్త్రాలను సిద్ధం చేస్తోంది.

పిఠాపురం నుంచి పోటీ కన్ఫామ్ అనుకునేలోపే తాజాగా మరో బాంబ్ పేల్చారు పవన్. ఇప్పటికే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ప్రకటించినప్పటికీ.. అవసరమైతే అక్క్డడి నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తానన్నారు. అమిత్ షా సూచిస్తే ఎంపీగా పోటీకి రెడీ అని కేడర్‌ను సందిగ్ధంలో పడేశారు. ఉదయ్, తాను స్థానాలు మార్చుకుంటామన్నారు జనసేనాని. దీంతో పవన్ ప్రకటన వెనక కొత్త వ్యూహం ఉందా..? పిఠాపురాన్ని వదిలి కాకినాడ ఎంపీ సీటు వైపు ఎందుకు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఆపరేషన్ పిఠాపురం చేపట్టిన వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకే ఈ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా లేక ఎంపీగా గెలిస్తే కేంద్రంలో ఇంకేదైనా పదవి ఆశించా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ డబుల్ గేమ్‌తో జనసేన కేడర్‌లో మళ్లీ అయోమయం నెలకొంది.

Tags:    

Similar News