Pawan Kalyan: అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసిన పవన్
Pawan Kalyan: జనసేన అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేత
Pawan Kalyan: అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసిన పవన్
Pawan Kalyan: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ అధోగతి పాలైందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్‌నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారాయన. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీఫామ్‌లు అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 21 అసెంబ్లీ, ఇద్దరు లోక్‌సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. వివాదాలకు తావులేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు జనసేనాని.