Kadapa: ఉధృతంగా ప్రవహిస్తున్న కడపలోని పాపాగ్ని నది

* అద్దాలమర్రి క్రాస్ వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జ్ * పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

Update: 2021-11-20 07:18 GMT

ఉధృతంగా ప్రవహిస్తున్న కడపలోని పాపాగ్ని నది(ఫైల్ ఫోటో)

Kadapa: కడపలో వర్షాలు తగ్గిన వరద ఉధృతి మాత్రం కొనసాగుతోంది. పాపాగ్ని నది ఉధృతికి చక్రాయపేట మండలం అద్దాలమర్రి క్రాస్ వద్ద ఉన్న బ్రడ్జి కొట్టుకుపోయింది. దీంతో అద్దాలమర్రి, చేరువుకాం పల్లె, సిద్దారెడ్డి గారి పల్లె, గడ్డం వారి పల్లె గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.

ఎక్కడికిక్కడ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిన్న సాయంత్రం నుండి చక్రాయపేట మండలంలోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. నిత్వావసర సరుకులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కదిరి, నంబర్పులకుంట, తలుపుల మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గండిలో పాపాగ్ని ఉధృతికి దాదాపు వంద మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది.

Tags:    

Similar News