Oxygen Leakage: విజయవాడ రైల్వే ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్

Oxygen Leakage: విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా

Update: 2021-05-13 01:35 GMT

Vijayawada Railway Hospital:(File Image)

Oxygen Leakage: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. అనేక వేల మంది వైద్యం అందక, సరైన సమయానికి ఆక్సిజన్ అందక బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్‌లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. నిన్న కూడా ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది.

ట్యాంకర్‌లోని ఆక్సిజన్‌ను ఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లీకైంది. దీంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం తెల్లని పొగలా ఆక్సిజన్ దట్టంగా కమ్మేసింది. దీంతో ఏం జరుగుతుందో తెలియని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆక్సిజన్ లీకైనప్పటికీ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, కాన్సంట్రేటర్లు ఉండడంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ వివిచారణకు ఆదేశించారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ వృధా కాకుండా చూడాలని విన్నవించుకుంటున్నారు.

Tags:    

Similar News