ఏపీలో కొత్త జిల్లాలకు తొలి అడుగు
Ap New Collectors: 26 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు
ఏపీలో కొత్త జిల్లాలకు తొలి అడుగు
Ap New Collectors: ఏపీలో కొత్త జిల్లాలకు తొలి అడుగు పడింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. శ్రీకాకుళం కలెక్టర్ గా శ్రీకేష్ బాలాజీ రావు, విజయనగరం కలెక్టర్ గా ఏ సూర్యకుమారి, పార్వతీపురం మన్యం కలెక్టర్ గా నిషాంత్ కుమార్, విశాఖపట్నం కలెక్టర్ గా మల్లిఖార్జున, అల్లూరి జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్, అనకాపల్లి కలెక్టర్ గా పట్టనసెట్టి రవి శుభాష్, కాకినాడ కలెక్టర్ గా క్రితికా శుక్లా, తూర్పుగోదావరి కలెక్టర్ గా మాధవి లత, కోనసీమ కలెక్టర్ గా హిమాంషు శుక్లా, పశ్చిమగోదావరి కలెక్టర్ గా ప్రశాంతి.
ఏలూరు కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్,కృష్ణా కలెక్టర్ గా రంజిత్ బాషా,ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా డిల్లీ రావు, గుంటూరు కలెక్టర్ గా వేణుగోపాల్ రెడ్డి, పల్నాడు కలెక్టర్ గా శివ శంకర్, బాపట్ల కలెక్టర్ గా కె విజయ,ప్రకాశం కలెక్టర్ గా దినేష్ కుమార్, నెల్లూరు కలెక్టర్ గా చక్రధర బాబు,తిరుపతి కలెక్టర్ గా కె వెంకటరమణా రెడ్డి, చిత్తూరు కలెక్టర్ గా ఎం హరినారాయణ,అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా గిరీష పి ఎస్,వైఎస్సార్ జిల్లా కలెక్టర్ గా విజయరామరాజు, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గా పి బసంత్ కుమార్, అనంతపురం కలెక్టర్ గా కె నాగలక్ష్మీ, నంద్యాల కలెక్టర్ గా మనజిర్ జీలాని, కర్నూల్ కలెక్టర్ గా పి కోటేశ్వరరావును నియమించారు.