Andhra Pradesh: ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లపై పొలిటికల్ రగడ

* బీజేపీ, టీడీపీ విమర్శలపై వైసీపీ కౌంటర్‌ *పెంచింది కొండంత.. తగ్గించింది గోరంత -వైసీపీ

Update: 2021-11-08 08:09 GMT

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లపై పొలిటికల్ రగడ(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల తగ్గింపుపై రాజకీయ రగడ తారాస్థాయికి చేరింది. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లపై కేంద్రం ధరలు తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.

కేంద్రం కొంత తగ్గించిందో లేదో ఏపీ సర్కార్‌ కూడా పన్నులు తగ్గించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం ధ‌ర‌లు త‌గ్గిస్తూ రాష్ట్రాలు కూడా తగ్గించాలని చెప్పింది. దీంతో ఏపీలో పెట్రో ధ‌ర‌లు త‌గ్గించాలంటూ జగన్‌ సర్కార్‌పై ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలో పెట్రోల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది. ఇక టీడీపీ కూడా రేపటి నుంచి పెట్రోల్‌ బంకుల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది.

ఇక ప్రతిపక్షాల తీరును ఎండగట్టేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. లీటర్‌ పెట్రోల్‌ ధరను వంద రూపాయలు దాటించి ఇప్పుడు ఐదో, పదో తగ్గించిన వారే రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా అని బీజేపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

ఎక్సైజ్‌ డ్యూటీ, ఇతర సెస్‌లు, సర్‌ ఛార్జీల రూపంలో 3లక్షల 35వేల కోట్లు వసూలు చేసిన కేంద్రం కేవలం 19వేల 475 కోట్లు మాత్రమే అన్ని రాష్ట్రాలకు పంచిందని వివరణ ఇచ్చింది. వాస్తవంగా కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41 శాతం పంచాల్సి ఉండగా 5.8 శాతం మాత్రమే చెల్లించి, చేతులు దులుపుకుందని స్పష్టం చేసింది.

మ‌రోవైపు క్రూడాయిల్‌ ధరలు సగటున తగ్గినప్పటికీ రేట్లు పెంచడాన్ని తప్పు పట్టింది ఏపీ ప్రభుత్వం . 2వేల 205 కోట్లతో 8వేల 970 కిలోమీట‌ర్ల రోడ్ల మరమ్మతులు చేస్తున్నామని, అందుకోసం కేవ‌లం లీటర్‌పై ఒక్క రూపాయి మాత్రమే అధికంగా వసూలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News