కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.. మరోసారి షాక్..

Update: 2019-11-06 06:37 GMT

మరోసారి వినియోగదారులను ఉల్లి ధరలు వణికిస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కేజీ ఉల్లి రూ .90 నుంచి రూ .100 వరకూ పలుకుతోంది. ఆగస్టు-సెప్టెంబర్ లలో సగటున ఉల్లి ధర కిలో రూ .80 కు చేరింది. మహారాష్ట్రలో నిరంతర వర్షాలు ఉల్లి పంటకు తీవ్ర నష్టం కలిగించింది. నాసిక్, అహ్మద్ నగర్, పూణేలలో కూడా ఉల్లిపంట తీవ్రంగా దెబ్బతింది. అయితే, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉల్లిపాయ ధరలు అక్టోబర్‌లో కొద్దిగా తగ్గాయి. అప్పట్లో అనేక రాష్ట్రాల్లో, కేజీ ఉల్లిపాయ ధర రూ .100 ను తాకింది. దేశంలో అతిపెద్ద టోకు ఉల్లిపాయ మార్కెట్ లాసల్‌గావ్ లో ప్రస్తుతం కిలోకు రూ .55.50 పలుకుతోంది. నాసిక్, అహ్మద్‌నగర్, పూణేలలో భారీ వర్షాలు పంటల నష్టం కారణంగా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. హైదరాబాద్‌, కర్నూల్, విజయవాడ నగరాల్లో కిలో రూ .70 నుంచి రూ .80 వరకు పలికింది.

తాజాగా హైదరాబాద్ లో నాణ్యమైన గ్రేడ్ -1 ఉల్లిపాయ రూ. 60 ఉండగా, గ్రేడ్ 2 నాణ్యత 50 రూపాయలు. మహాబుబ్‌నగర్‌లో గ్రేడ్ -1 నాణ్యమైన ఉల్లిపాయకు రూ .50, గ్రేడ్ -2 ధర రూ .40. రిటైల్ మార్కెట్లో ఇది సుమారు రూ. 70. వరకూ పలుకుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉల్లి ధర రూ .50 నుంచి రూ .70 మధ్య ఉంటుంది. ఉల్లి కొరత కారణంగా విదేశాల నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇరాన్, ఈజిప్ట్ , టర్కీ వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది కేంద్రం. ఉల్లి కొరత, ధరలు ఆకాశానికి చేరినందున ఉల్లి ఎగుమతులను సెప్టెంబర్‌లో నిషేధించింది కేంద్రం. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉల్లిపాయను ఎగుమతి చేయవద్దని వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల ఉల్లిపాయ ఎగుమతులను నిషేధించిన కేంద్రం, భవిశ్యత్ లో ప్రజల అవసరాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఐటిసి చాప్టర్ 2 లోని 51వ నిబంధనల ప్రకారం నిషేధం జరిగిందని పేర్కొన్నారు.  

Tags:    

Similar News