ఉల్లి ధరలు తగ్గుతున్నాయోచ్.. ఎంతో తెలుసా?

Update: 2019-12-23 02:57 GMT

గత కొన్ని రోజులుగా ప్రజలకు కన్నీళ్లు తెప్పించిన ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు వారాలుగా కేజీ ఉల్లి రూ. 130 నుంచి 160 వరకూ పలుకగా ఆదివారం ఆ ధర రూ.100 కు పడిపోయింది. హైదరాబాద్ లో మేలురకం ఉల్లి ధర రూ. 90 నుంచి 100 వరకూ పలుకుతోంది. అటు విజయవాడ, తిరుపతిలోని ఇదే ధర కొనసాగుతోంది. రెండు రోజుల కిందట కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాకు రూ.9,450 పలుకగా ప్రస్తుతం అది రూ.8 వేలకు పడిపోయింది.

ఇలాగే కొనసాగితే జనవరి 2020 వాటికి ఉల్లి ధరలు కిలో రూ.20 నుండి రూ. 25కు దిగి వస్తుందని భావిస్తున్నారు వ్యాపారులు. ఉల్లి మార్కెట్ కు రావడం క్రమంగా పెరుగుతుందని, జనవరి నాటికి మరింత పంట చేతికి వచ్చే అవకాశం ఉంది.. దీంతో సప్లై పెరిగి ఈ నెలలోనే కిలో ఉల్లి రూ. 30 నుండి రూ. 35కు రావొచ్చని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఉల్లి ఉల్లి దిగుబడి ఒక్కసారిగా తగ్గింది. దాంతో ధరలు అమాంతం పెరిగాయని.. ప్రస్తుతం వర్షాలు తగ్గటంతో ముందు ముందు ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

కాగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేజీ ఉల్లి రూ. 25 కే రైతు బజార్లలో విక్రయిస్తోంది ప్రభుత్వం. సబ్సిడీ ఇస్తున్న కారణంగా కిలో ఉల్లి సామాన్యులకు 25 రూపాయలకే దొరుకుతోంది. అయితే వీటికోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు

రాష్ట్రంలోని అన్ని రైతుబజార్ల లో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి అని సూచించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా అక్రమంగా ఉల్లిపాయల నిల్వలు చేసి అధిక ధరలకు విక్రయిస్తే ఆ షాపులపై మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags:    

Similar News