ఉల్లి కొరతకు ఏపీ సర్కార్ చెక్‌..తక్కువ ధరకే ఉల్లి అమ్మాలని నిర్ణయం

Update: 2019-09-25 11:46 GMT

గత కొన్ని రోజులుగా ఉల్లి ధర అధికంగా పెరుగుతుంది. దీనితో ఏపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ఉల్లిని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలను అందుబాటు లోనికి తీసుకవచ్చేందుకు కర్నూలు నుంచి వంద మెట్రిక్ టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేపటి నుంచి రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు ఉల్లిని అందుబాటులో ఉంచనున్నారు.

కిలో25 రూపాయల చొప్పున ఉల్లిని వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. మళ్లీ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ముందస్తుగా నాసిక్ నుంచి మరో 300 టన్నులు కొనుగోలు చేయనుంది. మొత్తంగా 900 మెట్రిక్ టన్నుల అవసరం అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీని భారాన్ని ప్రభుత్వం భరించనుంది. ఈ సబ్సిడీ ఉల్లిపాయలు రేపటి నుంచి రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు ఉల్లిని అందుబాటులో ఉంచనున్నారు.

Full View

Tags:    

Similar News