YSR Pension Kanuka: ఏపీలో కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక

YSR Pension Kanuka: రాష్ట్ర వ్యాప్తంగా 60.50 లక్షల మందికి పింఛన్ల పంపిణీ

Update: 2021-08-01 07:33 GMT

కొనసాగుతున్న వైస్సార్ పెన్షన్ కనుక (ఫైల్ ఇమేజ్)

YSR Pension Kanuka: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొనసాగుతుంది. ఉదయం నుంచే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల 50వేల 377 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తు్న్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 14 వందల 55 కోట్లు కేటాయించింది. 2 లక్షల 66 వేల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.

వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. బయోమెట్రిక్, ఐరిస్ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఇంటివద్దకే పెన్షన్ చేరుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాలు పింఛన్లు పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు.

తాడేపల్లి మండలం ఉండవల్లి పెనుమాకలో నూతనంగా మంజూరైన వైఎస్సార్ పెన్షన్‌ను సెర్ప్ సీఈవో ఇంతియాజ్ చేతుల మీదుల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వైఎస్సాఆర్ చేయూత పథకంలో 60 సంవత్సరాల నుంచి పథకానికి అనర్హులైన లబ్ధిదారులకు నూతనంగా వైఎస్సాఆర్ పెన్షన్ మంజూరు చేసింది ప్రభుత్వం.

Tags:    

Similar News