తుగ్లక్ నిర్ణయంతో ప్రైవేటు సంస్థలే కాదు, ప్రభుత్వ సంస్థలు వంతు: నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సీఎం వైఎస్ జగన్ పై మరోసారి నిప్పులు చెరిగారు.

Update: 2020-02-20 07:30 GMT
Nara Lokesh File Photo

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సీఎం వైఎస్ జగన్ పై మరోసారి నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఓ ప్రముఖ దినపత్రిక వచ్చిన కథనాన్ని జోడిస్తూ.. ట్వీట్టర్లో పోస్టు పెట్టారు. "మన తుగ్లక్ నిర్ణయంతో, నిన్నటి దాక ప్రైవేటు పెట్టుబడులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు వంతు. ఏమి పాపం చేసాడు ఆంధ్రుడు ఈ అపఖ్యాతి మూటగట్టుకోడానికి?" లోకేశ్ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ భావిస్తోందని ఆ పత్రిక కథనంలో పేర్కొంది. '' ఓఎన్జీసీ విస్తరణ కోసం కాకినాడలో 70 ఎకరాలను కొనుగోలు చేసింది. కానీ, కాల వ్యవధిలో పనులు పూర్తి చేయలేదు. ఏపీఐఐసీ రూ.20 వేర కోట్లు చలనా వేసింది. ఓఎన్జీసీ రూ.15 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. మరో రూ.5 కోట్లు వాయిదా రూపం లో చెల్లించేదుకు అనుమతి అడిగింది. కానీ, ఏపీఐఐసీ మాత్రం పట్టించుకోలేదు. ఓఎన్జీసీ చెందిన అధికారులు సీఎం ను కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ సీఎం అపాయింట్‌మెంట్ దక్కలేదు. సహజవాయువు, చమురులో వాటా లేదనే కారణంతో ప్రభుత్వం శీతకన్ను వేసింది'' అని ఓ పత్రిక తన కథనంలో తెలిపింది.

ఓఎన్జీసీ కార్యనిర్వాహక కార్యాలయాన్ని చెన్నై కేంద్రంగా ఉండేది. అయితే ఎన్టీఆర్ ఒత్తిడి మేరకు కేంద్రం రాజమండ్రికి తరలించింది. 1983 నుంచి ఓఎన్జీసీ తన కార్యకలాపాలను రాజోలు, రాజమండ్రి, నర్సాపురం ప్రాంతాల్లో చేస్తుంది. 10 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల 2009లో గుర్తించి గ్యాస్ నిక్షేపాలను తవ్బుది. ఇక్కడ మరో 40 వేల కోట్ల పెట్టుబడికి ప్రతిపాదించింది. వేలాది మందికి ఓఎన్జీసీ వల్ల ఉపాధి లభిస్తోంది. కానీ కేంద్రం విధించిన పలు నిబంధనల కారణంగా గ్యాస్‌, చమురును వెలికితీసే స్థానికంగా ఉపయోగించుకోవడం కుదరడం లేదు. పైపు లైన్ల ద్వారా ముంబై తరలిస్తున్నారు. దీంతో జగన్ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది'' అని ఆ పత్రిక పేర్కొంది.

కాగా.. ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని మాజీ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. తుగ్లక్ పాలనతో ప్రవేటు కంపెనీలేకాదు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రాష్ట్రం దాటిపోతున్నాయని ఆరోపించారు.  



Tags:    

Similar News