ఆ అఖండ విజయానికి ఏడాది ..వైఎస్సార్సీపీకీ నేడు స్పెషల్ డే!

గత ఏడాది(2019) మేలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్వర్యంలోని వైఎస్సార్ సీపీ పార్టీ 151 అసెంబ్లీ సీట్లతో, 23 ఎంపీ సీట్లతో ఘనవిజయం సాధించిన సాధించిన విషయం తెలిసిందే.

Update: 2020-05-23 03:07 GMT

గత ఏడాది(2019) మేలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్వర్యంలోని వైఎస్సార్ సీపీ పార్టీ 151 అసెంబ్లీ సీట్లతో, 23 ఎంపీ సీట్లతో ఘనవిజయం సాధించిన సాధించిన విషయం తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే ఇదే అతి పెద్ద విజయంగా రికార్డు సృష్టించింది. గతేడాది మే 11వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగగా, మే 23న ఫలితాలు వచ్చాయి. అంటే ఈ రోజుతో(శనివారం) ఏడాది పూర్తి అయ్యింది అన్నమాట.. ఈ ఎన్నికల్లో టీడీపీకీ 44 శాతం, సీపీఐకి 3.39 శాతం, సీపీఎంకు 2.96 శాతం ఓట్లు వచ్చాయి. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన వైఎస్సార్‌ సీపీ 250 శాతం ఓట్లతో భారీ విజయాన్ని అందుకుంది.

ముందుగా కొత్తగా ఏర్పడిన నూతన రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన జగన్.. ఆ తర్వాత 2019 ఎన్నికలకి ముందు ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఆ సమయంలో రాష్ట్రంలో 341 రోజుల పాటు 3,648 కి.మీ వరకు ఈ యాత్రను కొనసాగించారు. ఈ యాత్రలోనే తమ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాలను అధికారంలోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఇవే ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి.. ఆ తరవాత ఒకే విడతలో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ అభ్యర్దులను ప్రకటించి ప్రత్యర్ధులకు సవాల్ విసిరారు.. ఇక ఓటర్లు కూడా వైఎస్సార్‌ సీపీ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. ఇక టీడీపీకి కేవలం 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు మాత్రమే రాగా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన జనసేన పార్టీ కేవలం ఒక్క సీటును దక్కించుకోవడం విశేషం..

ఇక ఎన్నికల విజయం అనంతరం మాట్లాడిన జగన్ అతి కొద్దిరోజుల్లోనే మీతో మంచి సీఎం అనిపించుకుంటనని అన్నారు. ఆ దిశగానే తన అడుగులు వేశారు. ఎన్నికల్లో చెప్పిన నవరత్నాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా వినూత్నమైన పథకాలతో ముందుకు సాగుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఈ నెల 30తో ఏడాది పూర్తి చేసుకుంటున్నారు జగన్.

ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా వైఎస్సార్‌సీపీ స్పెషల్ ట్వీట్ చేసింది. "ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యల పై 5ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం.. 14నెలల పాటు 13 జిల్లాల్లో 3648 కిలో మీటర్ల పాదయాత్ర.. 2కోట్ల మంది ప్రజలతో నేరుగా మమేకం.. నవరత్నాలతో ప్రజలకు భరోసా.. అన్ని వర్గాల ప్రజల మద్దతతో ఏకపక్ష విజయం అన్నారు. విపక్షాల కుట్రలు విఫలమైన ఆనంద క్షణాలు..రాజన్న బిడ్డ, జనహృదయ విజేత జగనన్నకు అశేష ఆంధ్రావని పట్టం కట్టిన వేళ.. అంబరాన్నంటిన సంబరాలు. ప్రజలు మెచ్చే పరిపాలనకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాచబాట పడిన శుభసందర్భం. ప్రజలపక్షాన అలుపెరుగని పోరాటం, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా.. ప్రజాభిమానమే ఊపిరిగా, ప్రజలే తన బలంగా ముందుకు సాగిన జననేత" అంటూ ట్వీట్ చేసింది. 




 


Tags:    

Similar News