బుల్బుల్ తుఫానుతో అప్రమత్తంగా ఉండాలి : వాతావరణ శాఖ హెచ్చరిక

Update: 2019-11-06 06:55 GMT

బుల్బుల్ తుఫాను నేపథ్యంలో, తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో నవంబర్ 9 నుండి12 మధ్య భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాంద్యం పడమటి వైపుగా కదిలి.. తూర్పు-మధ్య మరియు ఆగ్నేయ బంగాళాఖాతం అటునుంచి ఉత్తర అండమాన్ లోకి ప్రవేశించింది. ఇది ఒడిశాలోని పారాడిప్‌కు ఆగ్నేయంగా 890 కిలోమీటర్లు అలాగే పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులకు 980 కిలోమీటర్ల ఆగ్నేయంలో కేంద్రీకృతమై ఉందని ఐఎమ్‌డి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది త్వరలోనే తీవ్ర మాంద్యానికి, బుధవారం తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా తెలిపారు, ఒడిశా తీరంలో తుఫాను తాకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.

భారీ వర్షాల దృష్ట్యా ఒడిశా రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 15 ని అప్రమత్తంగా ఉంచినట్టు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్‌ఆర్‌సి), రెవెన్యూ, విపత్తు నిర్వహణ కార్యదర్శి పి.కె.జేనా విలేకరులతో అన్నారు. ఇది మొదట్లో పశ్చిమ-వాయువ్య దిశలో, తరువాత ఉత్తర-వాయువ్య దిశలో, పశ్చిమ బెంగాల్ వైపు, బంగ్లాదేశ్ మరియు ఉత్తర ఒడిశా తీరాలకు వెళుతుందని మోహపాత్రా చెప్పారు. అయితే, తుఫాను తీసుకునే ఖచ్చితమైన దిశ దాని ల్యాండ్ ఫాల్ ప్రదేశం ఇంకా నిర్ధారించబడలేదు అని ఆయన చెప్పారు.

మే 3 న ఫాని తుఫాను ఒడిశాను ముంచెత్తిన సంగతి తెలిసిందే.. ఈ తుఫాను ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.. ఇప్పుడు సరిగ్గా ఆరు నెలల తరువాత మళ్ళీ బుల్బుల్ తుఫాను ఒడిశా వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని బాలసోర్, భద్రక్, కేంద్రపారా, జగత్సింగ్‌పూర్, గంజాం, పూరి, గజపతి, కొరాపుట్, రాయగడ, నబరంగ్‌పూర్, కలహండి, కంధమల్, బౌధ్, నుపాడా మరియు మల్కన్‌గిరి. జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉందని.. ఆంధ్రప్రదేశ్ లోని తీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి పేర్కొంది.

Tags:    

Similar News