సీఎం జగన్‌కు భద్రత మరింత పెంపు.. ఇక రంగంలోకి ఆక్టోపస్

Update: 2019-12-19 01:54 GMT

 సీఎం జగన్ కు ప్రస్తుతమున్న విఐపి భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం ఆక్టోపస్‌ను చేర్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతను పెంచేందుకు ఆక్టోపస్ ను ముఖ్యమంత్రి భద్రతా దళంలో చేర్చారు. ఆక్టోపస్ ఒక ప్రత్యేకమైన, ఉన్నత శక్తి అని ఒక ప్రకటనలో తెలిపింది. అయిదు బృందాలుగా మొత్తం 32 బంది ఆక్టోపస్ సిబ్బందితో భద్రత కల్పించారు. ఇక నుంచి సీఎం జగన్ ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఆక్టోపస్ బలగాల పహారా ఉంటుంది. భద్రతా కవరు ఆకస్మికంగా పెరగడానికి గల కారణాలను సిఎంఓ వివరించనప్పటికీ, విఐపిపై వైనా అనూహ్య దాడుల నుండి రక్షనుంచే భాగంలో ఇది ఉందని పోలీసు శాఖ అధికారులు తెలియజేశారు.

కాగా ఆక్టోపస్ ను (ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్)అని అంటారు. ఇది ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనే ఏపీకి ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక దళం. అలాంటి అక్టోపస్‌ టీమ్ ఇప్పుడు సీఎం జగన్ సెక్యూరిటీ వింగ్‌లో చేరడం చర్చనీయాంశమైంది. అయితే జగన్ Z + కేటగిరీలో లేనందున, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించలేదు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాడియు నక్సల్స్ నుండి ముప్పు ఉన్న వారి జాబితాలో ఉన్నారు. కాబట్టి ఆయనకు Z + కేటగిరీ భద్రత ఉంది.

Tags:    

Similar News