ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశకు నామినేషన్లు ప్రారంభం

* 18 రెవెన్యూ డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు * రాష్ట్రవ్యాప్తంగా 168 మండలాల్లో ఎన్నికలు * నామినేషన్ల తుది గడువు జనవరి 31

Update: 2021-01-29 06:00 GMT

Nominations in AP

ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల స్వీకరణ పారంభమైంది. అనేక మలుపులు, ఉత్కంఠ పరిణామాల అనంతరం పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ఇవాల్టీ నుంచి స్టార్ట్ అయ్యింది. ఫిబ్రవరి 9న 12 జిల్లాల్లోని 18 డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు తొలి పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల నోటీసులను జిల్లా కలెక్టర్లు విడుదల చేశారు. దాంతో ఇవాల్టీ నుంచి అభ్యర్ధుల నుంచి నామినేషన్ల స్వీకరిస్తు్న్నారు.

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే.. మొదటి విడత నామినేషన్ల ఘట్టం ఇవాళ్టీ నుంచి ప్రారంభమైంది. నామినేషన్ల ఘట్టం ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఫిబ్రవరి 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు రానున్నాయి. ఆ తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది.

ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్‌ అభ్యర్థులు 3వేలు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందని అదే విధంగా వార్డు సభ్యత్వానికి పోటీపడేవారు వెయ్యి రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అభ్యర్థులు 1500, మెంబర్ అభ్యర్ధులు 500 డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

మొదటి విడతలో భాగంగా విశాఖ అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో 340 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసులు ఉండడంతో నాలుగు గ్రామ పంచాయతీలకు ఎన్నికల నుంచి మినహాయింపు ఉంది. రాంబిల్లి మండలములో పంచదాల, అప్పలరాయుడుపాలం, జడ్ చింతువ, మన్యపు చింతువ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగడం లేదు.  

మరోవైపు ఇవాళ అనంతపురంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సందర్శించనున్నారు. విజయవాడ నుంచి విమానంలో బెంగళూరుకు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3వరకు కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏకగ్రీవాలు, ఎన్నికల నిర్వహణ, బందోబస్తు తదితర అంశాలపై కమిషనర్ సమీక్ష చేయనున్నారు. అక్కడి నుంచి కర్నూలు వెళ్లనున్నారు. 

Full View


Tags:    

Similar News