బెజవాడ దుర్గమ్మ దర్శనానికి బ్రేక్ ?

లాక్ డౌన్ ఐదో దశ సడలింపుల్లో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి హోటళ్లు, షాపింగ్ మాల్స్, దేవాలయాలు ఓపెన్ చేసేందుకు అనుమతులు లభించాయి.

Update: 2020-06-05 12:55 GMT

లాక్ డౌన్ ఐదో దశ సడలింపుల్లో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి హోటళ్లు, షాపింగ్ మాల్స్, దేవాలయాలు ఓపెన్ చేసేందుకు అనుమతులు లభించాయి. కొండ దిగువున కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతుండడంతో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై దుర్గగుడి అధికారులు తర్జన బర్జనపడుతున్నారు. కంటైన్ మెంట్ జోన్, బఫర్ జోన్ కింద ఆలయం వస్తుందో లేదో తెలపాలని కలెక్టర్ ను దుర్గగుడి ఈవో సురేష్ బాబు కోరారు.

కొండ వెనకాల విద్యాధరపురం, కుమ్మరిపాలెంసెంటర్, భవానీపురం, కొండ‌దిగువున మల్లికార్జునపేట ఇతర ప్రాంతాల్లో అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే దేవాదాయ శాఖ నుంచి ఇంకా రాని అనుమతులు రాలేదు. ఇంద్రకీలాద్రి పై ఆన్ లైన్, టిక్కెట్స్ తో పాటు సిబ్బంది తో ట్రైల్ రన్ ను వాయిదా వేసిన ఈవో వెల్లడించారు. దీంతో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించే అంశంపై సందిగ్ధత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్న దుర్గగుడి అధికారులు. 

Tags:    

Similar News