చెరకు రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం

చెరకు రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు రావు వెంకయ్య పేర్కొన్నారు.

Update: 2019-12-19 05:19 GMT
రావు వెంకయ్య

పాయకరావుపేట: చెరకు రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు రావు వెంకయ్య పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లో బుధవారం ఏపీ చెరకు రైతు సంఘం ప్రథమ మహాసభలు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు బ్యాంకు ఖాతాలున్నాయని, వారిలో కేవలం 8 కోట్ల మందికి మాత్రమే కేంద్రం నగదు జమ చేసిందని వివరించారు.

మిగతా వారు నగదు పొందేందుకు అర్హులు కాదా అని ప్రశ్నించారు. రైతు సమస్యలపై 250 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలనే విషయమై ఇప్పటికే పోరాటాలు చేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు కారణంగా రైతులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. రైతు భరోసా పూర్తిగా ఆదుకోలేదన్నారు. ఈపథకం రైతులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడం లేదని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తామని ప్రకటించి విఫలమయ్యారని తెలిపారు. 

Tags:    

Similar News