Anantapur: షాప్‌లో 22 వేల బిల్లు.. ఫోన్ పే చేస్తానని చెప్పి యజమానికి పంపకుండా.. నగదు మరో వ్యక్తికి బదిలీ

Anantapur: నగదు మెసేజ్ చూపించి అక్కడి నుంచి పరారీ

Update: 2024-03-02 11:00 GMT

Anantapur: షాప్‌లో 22 వేల బిల్లు.. ఫోన్ పే చేస్తానని చెప్పి యజమానికి పంపకుండా.. నగదు మరో వ్యక్తికి బదిలీ

Anantapur: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ... వాటిని ఉపయోగించుకుని అమాయకులను నిండా ముంచేసే కేటుగాళ్లు సైతం ఎక్కువయ్యారు. కేటుగాళ్ల చేతిలో అమాయకులు నిత్యం ఎక్కడో ఓ దగ్గర మోసపోక తప్పడంలేదు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఓ కిరణా స్టోర్ కు వచ్చిన ఓ వ్యక్తి తనకు భారీగా సిగరెట్ ప్యాకెట్ లు కావాలని షాపు యజమానిని అడిగాడు. అతడికి సిగరెట్ ప్యాక్ లు ఇచ్చిన యజమాని మొత్తం బిల్లు 22 వేలు అయిందని చెప్పాడు.

యజమానికి డబ్బులు పంపిస్తానని చెప్పిన మోసగాడు..దుకాణా యజమాని ఫోన్ పే నెంబర్ అడిగాడు. కానీ.. ఆ యజమానికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపించి.. షాపు యజమానికి డబ్బులు పంపినట్లు ఫోన్ పే మెసేజ్ చూపించాడు. వెంటనే తాను కొన్న సరుకులు అన్నీ సర్దుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంతసేపైనా తన అకౌంట్లో నగదు జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన షాప్ యజమాని మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News