ఏపీలో కొత్త మద్యం పాలసీ ఖరారు

ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ విధి విధానాలు ఖరారు చేసింది. అక్టోబర్ 1వ తేదీనుంచి దశల వారీగా రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. ఏడాదికి 13 జిల్లాల్లో కలిపి 3,500 షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తుంది.

Update: 2019-08-22 15:54 GMT

ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ విధి విధానాలు ఖరారు చేసింది. అక్టోబర్ 1వ తేదీనుంచి దశల వారీగా రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. ఏడాదికి 13 జిల్లాల్లో కలిపి 3,500 షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈషాపులు ఎక్కడెక్కడ పెట్టాలి, కాంట్రాక్టు ఉద్యోగులను ఎలా నియమించాలీ అనేది జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయిస్తుంది. ఉదయం పది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే దుకాణాలు తెరుచుకుంటాయి. కేవలం ఎమ్మార్పీ ధరలకే అమ్మకాలు జరపాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే తాము సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది.

Full View 

Tags:    

Similar News