Nellore GGH: సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

Nellore GGH: నెల్లూరు జీజీహెచ్‌ లో లైంగిక వేధింపుల ఆడియో టేపులు బయటపడ్డ సంగతి తెలిసిందే.

Update: 2021-06-07 16:45 GMT

నెల్లూరు జీజీహెచ్‌ (ఫొటో ట్విట్టర్)

Nellore GGH: నెల్లూరు జీజీహెచ్‌ లో లైంగిక వేధింపుల ఆడియో టేపులు బయటపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు నివేదికలు అందించాయి. వీటి ఆధారంగా జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ సస్పెండ్‌ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విచారణ కమిటీలు అందంచిన ప్రాథమిక నివేదిక మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. జూన్ 5న తాత్కాలిక చర్యల నిమిత్తం కర్నూలు వైద్య కళాశాలకు బదిలీ చేసింది. తాజా నివేదికలతో ఆయన్ను సస్పెండ్‌ చేసింది. ఈ ఆడియో టేపులు పది నెలల క్రితం జరిగినట్లుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

వీటితో పాటు టీవీల్లో కూడా ప్రసారం అయ్యాయి. ఈమేరకు ప్రభుత్వ రెండు కమిటీలను నియమించింది. ఈమేరకు విచారణ జరిపి ప్రభాకర్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. వైద్యారోగ్యశాఖ విచారణ సమయంలోనూ ఆయన నెల్లూరు విడిచి వెళ్లొద్దని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:    

Similar News