బందరు పోర్టు ఒప్పందం రద్దు.. హైకోర్టుకు నవయుగ సంస్థ!

Update: 2019-09-05 11:16 GMT

బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఆగస్టు 8న జారీ చేసిన జీవో 66ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని నవయుగ సంస్థ కోరింది. పోర్టు పనుల కోసం భూములను అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషన్‌లో నవయుగ తరపు న్యాయవాదులు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒప్పందం రద్దు సరికాదని ఇప్పటికే 436 కోట్లు ఖర్చు చేశామని జీవో 66ను రద్దు చేయాలని నవయుగ సంస్థ పిటిషన్‌ లో పేర్కొంది. న్యాయవాదుల విధుల బహిష్కరించిన కారణంగా ఈ పిటిషన్ పై విచారణను ఈనెల 12కు వాయిదా వేశారు. 

Tags:    

Similar News