మెట్ ల్యాబ్ పై జాతీయ స్థాయి సదస్సు

వీ కే ఆర్, విఎన్ బి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ విభాగాధిపతి గొరిపర్తి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మెట్ ల్యాబ్ పై జాతీయ స్థాయి కార్యశాల ప్రారంభమయ్యింది.

Update: 2019-12-17 09:04 GMT

గుడివాడ: వీ కే ఆర్, విఎన్ బి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ విభాగాధిపతి గొరిపర్తి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మెట్ ల్యాబ్ పై రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ స్థాయి కార్యశాల ప్రారంభమయ్యింది. కేఎల్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ పి విజయ్ ముని రిసోర్స్ పర్సన్ గా హాజరయ్యారు.

మెట్ ల్యాబ్ కు సంబంధించిన బేసిక్ కమాండ్లు సిములేషన్ టూల్ బాక్స్ స్, నెట్ వర్క్ నమూనాలు, పవర్ ఎలక్ట్రానిక్స్, కన్వర్ట్, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల కార్యదర్శి వేములపల్లి వెంకటేశ్వరరావు, కరస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్య, ప్రిన్సిపల్ డాక్టర్ జి శ్యామ్ ప్రసాద్, డైరెక్టర్ బి కళ్యాణ్ కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News