నాటా వేడుకలకు సీఎంకు ఆహ్వానం
వచ్చే ఏడాది జూన్ మాసంలో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) వేడుకలకు ముఖ్య అతిధిగా రావలసిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నాటా సభ్యులు ఆహ్వానించారు.
వచ్చే ఏడాది జూన్ మాసంలో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) వేడుకలకు ముఖ్య అతిధిగా రావలసిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నాటా సభ్యులు ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నాటా అధ్యక్షుడు డాక్టర్ రాఘవ, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి జి.నారాయణ, పీఆర్‌వో డీవీ కోటిరెడ్డి సీఎంను కలసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అలాగే పలువురు మంత్రులకు కూడా ఆహ్వాన పత్రాలు అందజేశారు.
వాస్తవానికి ఈ ఏడాదే ఈ వేడుకలకు హాజర అవుతారని భావించారు. కానీ షెడ్యూల్ పరంగా ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా నాటా సభ్యులు సీఎంను కలవడంతో ఈసారి తప్పక హాజరవుతారని భావిస్తున్నారు. కాగా ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా)లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన తెలుగువాళ్లు ఉన్నారు. అందులో ప్రధానంగా రాయలసీమకు చెందిన వారు ఎక్కువగా ఉండటం విశేషం.