Bus Accident: కొవ్వూరు హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
Bus Accident: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై పెను ప్రమాదం తప్పింది.
Bus Accident: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న RRR ప్రైవేట్ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ 10 మంది ప్రయాణికులను రక్షించాడు. భారీగా మంటలు వ్యాప్తి చెందడంతో బస్సు పూర్తిగా దగ్దమైయ్యింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సులో ఉన్న ప్రయాణికులను ప్రత్నామ్నాయ బస్సులో కొప్పూరుకు తరలించారు.