బాలా మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు: లోకేష్

Update: 2019-06-10 08:32 GMT

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇవాళ 59వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ 59వ జ‌న్మ‌దినోత్స‌వాన్ని ఆయ‌న అభిమానులు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బాల‌కృష్ణకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా బాలయ్య అల్లుడు మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "తన నటచతురతతో కోట్లాది ప్రజల అభిమానం సంపాదించిన కళాకారుడిగా, నిరంతరం ప్రజా సంక్షేమమే పరమావధిగా, ప్రజలకోసం పనిచేస్తున్న మా బాలా మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 



Tags:    

Similar News