దివంగత నేతలకు నివాళులు అర్పించిన నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీ దివంగత నేతలకు నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఈ మేరకు

Update: 2019-11-02 06:11 GMT

తెలుగుదేశం పార్టీ దివంగత నేతలకు నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు మంత్రిగా పనిచేసి కర్నూలు జిల్లా అభివృధ్ధికోసం పాటుపడి, ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తెదేపా సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దివంగత బైరెడ్డి విశ్వమోహన్ రెడ్డిగారి 72వ జయంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నాను.

అలాగే మూడు దశాబ్దాల పైగా రాజకీయానుభవంతో, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు చేపట్టి, నిరంతరం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆదర్శ రాజకీయవేత్త, తెదేపా నాయకులు, కీర్తిశేషులు ఎర్రంనాయుడుగారి వర్ధంతి సందర్భంగా, వారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను.' అంటూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు నారా లోకేశ్.

Tags:    

Similar News