నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.ఆర్టీసీ ధరలకు నిరసనగా బస్సులో ప్రయాణించి నిరసన తెలియజేశారు.

Update: 2019-12-11 05:05 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.ఆర్టీసీ ధరలకు నిరసనగా బస్సులో ప్రయాణించి నిరసన తెలియజేశారు. అయితే లోకేష్ బస్సు దిగి అసెంబ్లీకి ఇతర ఎమ్మెల్సీలతో కలిసి వెళ్తుండగా ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్లు తెలుస్తోంది. ఒక్క అడుగు ముందుకు పడినా ఆ డ్రోన్ ఆయన తల మీద పడి ఉండేది. దాంతో లోకేష్ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఆ డ్రోన్ ను తీసేశారు. ఈ ఘటనతో అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

అంతకుముందు ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి స్వయంగా బస్సు చార్జీల పెంపును కండెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఏటా ప్రజలపై 700 నుంచి 1000 కోట్ల భారం వేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు లోకేష్. ఫ్రీగా ఇచ్చే ఇసుకను పెంచేశారు, ఉల్లిపాయలు పెంచేశారు, ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెంచుకుటూ పోతే పేదవాడు ఎలా బ్రతుకుతాడని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Tags:    

Similar News