టీడీపీ నేతలపై దాడి.. మా నాయకులదే తప్పు.. లోకేశ్ పేరిట ఫేక్ ట్వీట్‌

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఫేక్ ట్విట్‌లు వెంటాడుతున్నాయి.

Update: 2020-03-11 13:18 GMT
Lokesh File Photo

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఫేక్ ట్విట్‌లు వెంటాడుతున్నాయి. తాజాగా మరోసారి లోకేశ్‌కు ఫేక్ ట్విట్ మార్ఫింగ్ కలకలం రేపింది. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలపై దాడి జరిగింది. ఈ గొడవకు ప్రస్తావిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. వైకాపా రాక్షస పాలనకి మాచర్ల ఘటన పరాకాష్ట. రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతుంది. టీడీపి నాయకులు బోండా ఉమ, బుద్దా వెంకన్న గార్లపై వైకాపా రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారు. ఇద్దరు నాయకులని హత్య చెయ్యడానికి ప్రయత్నించారు అని ట్వీట్ చేశారు.

లోకేశ్ ఫేక్ ట్వీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. దీంతో తన ట్వీట్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై లోకేశ్ సీరియస్ అయ్యారు. కానీ ఈ ట్వీట్‌ను మార్చేసి పూర్తిగా అర్ధం మారేలా మార్ఫింగ్ చేశారు. అయితే లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ysjagan గారు విసిరే 5 రూపాయిల కోసం వైకాపా పేటీఏం బ్యాచ్ ఎంతకైనా దిగజారుతుంది. మార్ఫింగ్ ట్వీట్స్ తో సంబరపడుతున్న జఫ్ఫా బ్యాచ్ కి నా సానుభూతి తెలియజేస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు. ఇక టీడీపీ కూడా దీనిపై మండిపడింది. ఐదు రూపాయల ఎంతకైనా దిగజారుతారని ట్వీట్ చేసింది. 




Tags:    

Similar News