Namasthe Andhra Pradesh: త్వరలోనే నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రిక..
* ఇప్పటికే ఆర్ఎన్ఐ అనుమతితో పాటు అన్ని అనుమతులు
త్వరలో నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రిక
KCR: త్వరలోనే నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రిక అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆర్ఎన్ఐ అనుమతితో పాటు అన్ని అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టిసారించిన నేపథ్యంలో నమస్తే తెలంగాణను అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మొదటగా ఏపీలో నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రారంభించి తర్వాతి రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.