Nalgonda: నల్గొండలో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి ఎల్‌కేజీ విద్యార్థిని మృతి
నల్గొండ పట్టణంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి LKG విద్యార్ధిని జస్మిని మృతి చెందింది. దుప్పలపల్లి రోడ్డులో ఘటన చోటు చేసుకుంది.
నల్గొండ పట్టణంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి LKG విద్యార్ధిని జస్మిని మృతి చెందింది. దుప్పలపల్లి రోడ్డులో ఘటన చోటు చేసుకుంది. బస్సును డ్రైవర్ రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మరణించిందని డీఈఓ భిక్షపతి తెలిపారు. స్కూల్ యాజమాన్యం, డ్రైవర్ పై కఠిన చర్యలకు ఆదేశించారు.