Roja Selvamani: వాలీబాల్ ఆడిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా
Roja Selvamani: వడమాలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోటీలు...
Roja Selvamani: వాలీబాల్ ఆడిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా
Roja Selvamani: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏం చేసినా వినూత్నంగా ఉంటుంది. ఇటీవల ఆమె తన భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ ఆడగా తాజాగా వాలీబాల్ కోర్టులోకి అడుగుపెట్టారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలలో భాగంగా వాలీబాల్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు.
వడమాలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని మైదానంలో ఈ పోటీలను నిర్వహించారు. నియోజకవర్గంలో పండుగలు, పర్వదినాలలో ఇలాంటి పోటీలను నిర్వహిస్తుంటారు రోజా.