Nagababu: రోజా.. మీది నోరా.. మున్సిపాలిటీ చెత్తకుప్ప..?

Nagababu: చిరంజీవి, పవన్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోం

Update: 2023-01-07 04:00 GMT

Nagababu: పర్యాటకశాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు

Nagababu: మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా కామెంట్స్‌పై మెగా బ్రదర్‌ నాగబాబు ఫైర్‌ అయ్యారు. చిరంజీవి, నాగబాబు, పవన్‌ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు రోజా. సాధారణంగా సినీనటులు సెన్సిటివ్‌గా ఉంటారని, అందరికీ సాయం చేస్తారని కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు. అందుకే రాజకీయాల్లో వీరిని ప్రజలు ఆదరించలేదని చురకలు అంటించారు. ఈ ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా విమర్శనాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ మూతికి ప్లాస్టర్‌ వేసుకుంటారని ఆరోపించారు. రోజా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మెగా బ్రదర్‌ నాగబాబు. చిరంజీవి, పవన్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, రోజా నోరు మున్సిపాలిటీ చెత్తకుప్పంటూ మండిపడ్డారు. పర్యాటకశాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని, ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలని రోజాకు నాగబాబు చురకలు అంటించారు. టూరిజం ర్యాకింగ్స్‌లో ఏపీ 18వ స్థానంలో ఉందని, రోజా మంత్రి పదవి ముగిసేలోగా అదికాస్త 20వ స్థానానికి వెళ్తుందని విమర్శించారు నాగబాబు.

Tags:    

Similar News