అమరావతి భూముల లెక్కలు వివరించిన నాగబాబు

అసెంబ్లీలో రాజధానికి మూడు రాజధానులు అవసరం అవుతాయేమోనని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Update: 2019-12-22 09:25 GMT
నాగబాబు ఫైల్ ఫోటో

అసెంబ్లీలో రాజధానికి మూడు రాజధానులు అవసరం అవుతాయేమోనని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇంచుమించుగా సీఎం వ్యాఖ్యలకు తగ్గట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జిఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. దాంతో అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో, రైతుల ఆందోళనకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్, జనసేన నేత నాగబాబును రైతులను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు నాగబాబు. నాదెండ్ల మనోహర్ తో కలిసి రైతుల వద్దకు వెళ్లి అక్కడి రైతుల మానసిక స్థితి గురించి తెలుసుకున్నట్లు చెప్పారు.

టీడీపీ పాలనలో సేకరించిన మొత్తం 34,322 ఎకరాలను ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సేకరించినట్టు గుర్తు చేశారు. 29,881 మంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని అన్నారు. అయితే ఇందులో 5 వేల ఎకరాల భూమిని ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడిందని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం చేసిన ఆరోపణలను నిజమని నాగబాబు పేర్కొన్నారు. అయితే దీనిపై పూర్తి విచారణ జరిపించాలని, నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో అమరావతి భూములపై కొన్ని గణాంకాలను పేర్కొన్నారు.

అందులో.. ఎకరానికి దిగువన ఉన్న భూములను వదులుకున్న మొత్తం రైతుల సంఖ్య 40,490, మొత్తం ఎకరాలు 10,034 ఎకరాలు. ఒకటి నుండి రెండు ఎకరాల లోపల భూమి ఇచ్చిన రైతుల సంఖ్య 5,227. మొత్తం ఎకరాలు 7,465 ఎకరాలు. రెండు నుంచి ఐదు ఎకరాల మధ్య భూమి ఇచ్చిన రైతుల సంఖ్య 3,337. మొత్తం ఎకరాలు 10,103 ఎకరాలు. ఐదు నుంచి 10 ఎకరాల మధ్య ఇచ్చిన రైతుల సంఖ్య 668. మొత్తం ఎకరాలు 4,420 ఎకరాలు. 10 నుండి 20 ఎకరాల వరకు భూమి ఇచ్చిన రైతుల సంఖ్య 142, మొత్తం వైశాల్యం 1,877 ఎకరాలు. 20 నుంచి 25 ఎకరాలలో భూమి ఇచ్చిన రైతుల సంఖ్య 12, మొత్తం వైశాల్యం 269 ఎకరాలు. 25 ఎకరాలకు పైగా భూమి ఇచ్చిన రైతుల సంఖ్య 5, మొత్తం వైశాల్యం 151 ఎకరాలు. అని నాగబాబు పేర్కొన్నారు.



Tags:    

Similar News