AP Elections: మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు

AP Elections: ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు హైకోర్టు మెట్లెక్కిన రాజకీయ పార్టీలు

Update: 2021-02-27 07:25 GMT
నిమ్మగడ్డ రమేష్ (ఫైల్ ఇమేజ్)

AP Elections:  మునిసిపల్ ఎన్నికల సమరానికి అన్నీ అడ్డంకులే. అడుగడుగునా కేసులే. సై అని ఎస్ఈసీ అంటే నై అని రాజకీయ పార్టీలన్నాయి. నోటిఫికేషన్ ఇచ్చాక కూడా బాలారిష్టాలు వదల్లేదు. చివరికి హైకోర్టు మెట్లెక్కారు. ఒక్కసారి నోటిఫై చేసాక నో అన్నా ఇంకేమన్నా ఎస్ఈసీ నిర్ణయం ఫైనల్ అంది హైకోర్టు.

పంచాయితీ ముగియగానే మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తెర మీదకొచ్చింది. ప్రతీదానికీ కోర్టుందిగా అన్నట్టు కొందరు కోర్టుకెక్కారు. పదహారు పిటీషన్లేసారు. ఏదీ పారలేదు‌. కోర్టు కొట్టేసింది. ఇక సోమవారం మిగిలిన పిటీషన్లపై హైకోర్టులో తీర్పొస్తే అంతా కూల్. ఇంతలో ఎస్ఈసీ తన ప్రణాళిక అమలులో పడ్డారు. 27న తిరుపతి, 28న విజయవాడ, మార్చి 1న విశాఖ అంటూ తన టూర్ ప్లాన్ ఇచ్చేసారు. మూడు రోజుల్లో పదమూడు జిల్లాల అధికారులు, నేతలతో సమావేశం కానున్నారు ఎస్ఈసీ.

12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో షెడ్యూల్‌ సిద్ధంగా ఉంది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8 సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. అదే రోజు ఫలితాలు కూడా విడుదలవుతాయి. దాంతో మునిసిపల్ సమరం ముగుస్తుంది.

Tags:    

Similar News