నేటి నుంచి విజయవాడలో కఠినంగా ఆంక్షలు

ఇవాళ్టి నుంచి విజయవాడలో కఠినంగా ఆంక్షలు విధించారు. ఉ. 6 నుంచి ఉ.9 వరుకు మాత్రమే రోడ్ల మీదకి అనుమతి ఇవ్వనున్నారు.

Update: 2020-03-30 05:38 GMT

ఇవాళ్టి నుంచి విజయవాడలో కఠినంగా ఆంక్షలు విధించారు. ఉ. 6 నుంచి ఉ.9 వరుకు మాత్రమే రోడ్ల మీదకి అనుమతి ఇవ్వనున్నారు.కిరాణా షాపులు, పళ్లుమార్కెట్, రైతు బజార్లు, కాళేశ్వరరావు మార్కెట్ కి మూడుగంటలు మాత్రమే తెరిచి ఉంటాయి. ఉదయం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరుకు మిల్స్ , డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉండనున్నాయి. ఎక్కడా పదిమంది గుమిగూడి ఉండద్దని అధికారులు సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించారు.

ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి. ఉ. 7 నుంచి సాయంత్రం 7 వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతి ఇచ్చారు. మెడికల్, హెల్త్ డిపార్ట్‌మెంటు ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ, వీయంసీ, వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది.

మీడియా వాహనాలకు, గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్లు విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, అనుమతి లేదని తేల్చచెప్పారు.

Tags:    

Similar News