అనకాపల్లి జిల్లాలో బుచ్చయ్యపేటలో వానరసేనకు చెక్... కొన్నాళ్లుగా జనాలకు చుక్కలు చూపిస్తున్న కోతులు

* ఎమ్మెల్యే ధర్మశ్రీకి మొరపెట్టుకోవడంతో నిధులు గ్రాంట్... రూ.50లక‌్షలతో కోతుల పట్టివేత కార్యక్రమం

Update: 2022-12-01 10:35 GMT

అనకాపల్లి జిల్లాలో బుచ్చయ్యపేటలో వానరసేనకు చెక్... కొన్నాళ్లుగా జనాలకు చుక్కలు చూపిస్తున్న కోతులు

Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట, ఎల్బీపీ అగ్రహారంలో చుక్కలు చూపిస్తున్న వానరసేనకు..ఎమ్మెల్యే సహకారంతో చెక్ పెట్టారు అక్కడి రైతులు. ఏకంగా 14గ్రామాలలో పంటలు పాడు చేయడమే కాకుండా, గ్రామాల్లోకి చొరబడి దాడులు చేయడంతో వారంతా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి తమ గోడును చెప్పుకున్నారు. రైతుల, గ్రామస్తులు అవస్థలను గమనించిన ఎమ్మెల్యే.. పంచాయతీల నుంచి, విశాఖ డైరీ నుంచి 50లక్షల రూపాయలను గ్రాంట్ చేసి కోతుల పట్టివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రత్యేకంగా మనుషులను పెట్టి కోతుల ఏరివేసే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకూ 500 కోతులు పట్టుకున్నారని..ఇంకా మిగిలిన కోతులను పట్టుకుంటే తమ కష్టాలు తీరిపోతాయని రైతులు అంటున్నారు.

Tags:    

Similar News