Rapaka Vara Prasada Rao: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై విచారణకు ఈసీ ఆదేశం

Rapaka Vara Prasad: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై విచారణకు ఈసీ ఆదేశం

Update: 2023-05-04 09:11 GMT

Rapaka Vara Prasad: పబ్లిక్ మీటింగ్‌లో దొంగ ఓట్లతో గెలిచానని రాపాక వ్యాఖ్యలు

Rapaka Vara Prasad: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై ఎన్నికల కమిషన్‌ విచారణకు ఆదేశించింది. ఈ ఏడాది మార్చిలో ఓ పబ్లిక్ మీటింగ్‌లో దొంగ ఓట్లతో గెలిచానని రాపాక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు సంచలనం రేపగా.. తాను మీటింగ్‌లో ఉన్న వారిని నవ్వించడానికి అలా అన్నానని వివరణ ఇచ్చారు. అయితే రాపాక వ్యాఖ్యలపై రాజోలుకు చెందిన వెంకటపతిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో రాపాక వ్యాఖ్యలపై విచారణ చేసి వారంలోగా నివేదిక ఇవ్వాలని... కోనసీమ జిల్లా కలెక్టర్‌కు ఏపీ సీఈవో ఆదేశాలు జారీ చేసింది. 

Tags:    

Similar News