ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఇంటి వద్ద ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు లోని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఇంటివద్ద బుధవారం 2020 ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

Update: 2020-01-01 12:11 GMT
ఎమ్మెల్యే గొల్ల బాబురావు

పాయకరావుపేట : ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు లోని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఇంటివద్ద బుధవారం 2020 ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకి పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు , ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే పూలదండలు గాని, పూల బొకేలు గాని తీసుకురావద్దని చెప్పిన గొల్ల బాబూరావు విజ్ఞప్తిని విజ్ఞప్తి మేరకు అభిమానులందరూ పుస్తకాలు, పెన్నులు, స్కూల్ బ్యాగులు తీసుకుని వచ్చారు.వాటన్నిటినీ నిరుపేద విద్యార్థులకు పంచడానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే సూచించినట్లుగా అభిమానులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొణతాల శ్రీనివాస్, మధు వర్మ, నూకునాయుడు, సాయి, పెదఈశ్వరరావు, కొర్ని రాజారమేష్, శ్రీను రాజు, బోండా దివానం, మందగుదుల రమణ, సింహాద్రి యాదవ్, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News