పొలం పనుల్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

Update: 2019-08-21 09:52 GMT

ఆయన అధికార పార్టీ శాసనసభ్యుడు అయినా గర్వపడకుండా ఓ రైతు బిడ్డగా నేటికి పొలం పనుల్లో బిజీబీజీగా గడుపుతున్నారు. ఎమ్మెల్యేగా నియోజక వర్గ బాధ్యతల్ని చూసుకుంటూనే వ్యవసాయం సాగు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి ఇస్తామని స్వయంగా ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చినా సామాజిక సమీకరణలతో కేబినెట్ లో చోటు లభించలేదు. అయినా మొదటి నుంచి వ్యవసాయంపై ఆసక్తితో ఉన్న ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికీ పంట సాగు చేస్తూ అందర్ని ఆకట్టుకుంటున్నారు.

ఆదునిక టెక్నాలజీతో వ్యవసాయసాగు అందుబాటులోకి వచ్చినా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం స్వయంగా భుజాలపై నారు, యూరియా బస్తాలు మోసుకు రావడమే కాదు వాటిని పొలంలో నాటు వేస్తూ యూరియా పిచికారి చేస్తున్నారు. సీజన్ వారిగా పంటల్ని సాగు చేస్తున్న ఎమ్మెల్యే ఆర్కే కూలీలతో కలిసే భోజనం చేస్తుంటారు. ఇంట్లోనూ పశువుల బాగోగులు కూడా ఆయనే చూసుకుంటున్నారు. ఇలా వ్యవసాయ పనుల్ని చక చకా చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే ఆర్కే. 

Full View

Tags:    

Similar News