ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం...

-ఢిల్లీ, విజయవాడ విమానానికి తప్పిన ప్రమాదం - టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం -పిడుగు ప్రభావానికి విమానం చెల్లాచెదురైన వస్తువులు, కిందపడిపోయిన టాయ్‌లెట్‌ సింకులు

Update: 2019-09-22 04:31 GMT

ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తున్న ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి 7 గంటలా 28 నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి టెకాఫ్‌ తీసుకున్న ఎయిరిండియా విమానం కొద్ది సేపటికే మార్గమధ్యంలో తీవ్ర కుదుపులకు లోనైంది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడటంతో విమానం షేక్‌ అయ్యింది. అందులో ఉన్న ప్రయాణీకులకు సంబంధించిన వస్తువులు చెల్లా చెదురై కింద పడ్డాయి. టాయ్‌లెట్‌లో సింకులు, ఇతర వస్తులు పడిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఎట్టకేలకే విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యింది. 150 మంది ప్రయాణీకులు సురక్షితంగా చేరుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.  

Tags:    

Similar News