అనంతపురం జిల్లాలో హద్దుమీరిన టీచర్‌..పర్సనల్‌ విషయాలను టార్గెట్‌ చేస్తున్న పంతులమ్మ

Update: 2019-08-08 09:31 GMT

తల్లీ, తండ్రీ, గురువు దైవం అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంతటి ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే విద్యార్ధులు తల్లిదండ్రుల దగ్గరకంటే గురువుల దగ్గరే ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి. దండించే వారి కంటే దగ్గరగా తీసుకుని అర్ధమయ్యే రీతిలో చదువు చెప్పే టీచర్లను చిన్నారులు ఎన్నటికీ మర్చిపోరు. అలాగే పిల్లల పట్ల మితిమీరి ప్రవర్తిస్తే తట్టుకోలేని ఆ చిన్నారులు భావోద్వేగానికి లోనవుతారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని అచ్చం అలాంటి దృశ్యమే కనిపించింది.

కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థినులు ఓ టీచర్‌ వల్ల నరకం అనుభవిస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాద్యాయురాలు పర్సనల్‌ విషయాలను అడుగుతూ టార్చర్‌ చూపిస్తున్నారు. క్యాస్ట్, కలర్‌, మనీని దృష్టిలో పెట్టుకుని విద్యార్ధినుల పట్ల అనుచితంగా వ్యవహరించడంతో తట్టుకోలేని బాలికలు ఏకంగా మంత్రిగారికే ఉత్తరాలు రాయడంతో అసలు విషయం బయటపడింది.

హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి వచ్చిన మంత్రి శంకర్ నారాయణతో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకుని బోరున విలపించారు. హింది టీచర్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతూ తమ మనోభావాలను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్న పంతులమ్మను మార్చేయాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. తమ హాస్టల్‌లోనే కాదు ఏ హాస్టల్‌లో ఇలాంటి టీచర్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

బాలికలు ఎదుర్కొన్న సమస్యలను విని చలించిపోయిన మంత్రి ఉపాధ్యాయుల తీరుపై కన్నెర్ర చేశారు. సంబంధింత అధికారులతో మాట్లాడి సదరు టీచర్లకు షోకాజ్‌ నోటిసులు జారీ చేయాలని ఆదేశించారు. క్రమశిక్షణ అలవరచుకుండా చదువంటే భయపడేలా చేసే టీచర్లలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పవిత్రమైన వృత్తిలో పనిచేస్తూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయులే విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతూ ఉపాధ్యాయ వృత్తికే తలవంపులు తెస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

Full View  

Tags:    

Similar News